ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమా విడుదల వాయిదా పడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య రీమేక్ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ ని తమ అవసరానికి వాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఏ ఒక్కరు ఆయను సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనే అవసరమయ్యారు. అవసరం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర కి వచ్చారా? భీమ్లా నాయక్ సినిమాని వాళ్ళు అడగడం వల్ల వాయిదా వేశారని మేము అనుకుంటాం.

 పవన్ కళ్యాణ్ సినిమాకి సమస్య వస్తే రేపు ఈ నిర్మాతలు వస్తారా..?? అని అభిమానులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయం పై ఓ నెటిజన్ నిర్మాత బండ్ల గణేష్ ని సహాయం చేయమని ట్విట్టర్లో అడిగాడు. ఇక ఆ నెటిజన్ ట్వీట్ కి బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ నెటిజన్ ట్వీట్ చేస్తూ..' మేము అర్థం చేసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ సమస్య వస్తే రేపు నిర్మాతలు వస్తారా? బండ్లన్న నువ్వు అడగొచ్చు కదా మన తరపున దిల్ రాజును, డి.వి.వి.దానయ్య ను, మిగతా ప్రొడక్షన్ హౌస్ లను' అంటూ బండ్ల గణేష్ ని ట్యాగ్ చేసాడు. ఇక ఈ ట్వీట్ పై బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ..

" న్యాయానికి ధర్మానికి రోజులు లేవు బ్రదర్" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ట్వీట్ నెట్టింట్లో ఎంతో వైరల్ గా మారుతోంది. ఇక భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా.. నిర్మాతలు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని ఫిబ్రవరి 25 కు వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాని దర్శకుడు సాగర్ కేంద్ర డైరెక్ట్ చేస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు.తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: