దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్ దేవగన్,  సముద్ర ఖని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతుతుండగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు,   ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డి వి వి దానయ్య నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి, ఇలా ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను కలగజేసిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది, అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ స్పీడు పెంచింది.

 ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్ లు నిర్వహించి సినిమాను ప్రమోట్ చేసిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తాజాగా ముంబైలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది, అయితే ఇప్పటికే ముంబైలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ పూర్తిచేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు చేయబోతోంది, ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబ‌ర్ 26 న కేర‌ళ ప్ర‌ధాన ప‌ట్టం కొచ్చిన్‌లో.. డిసెంబ‌ర్ 27 న చెన్నై మ‌హా నగ‌రంలో, డిసెంబ‌ర్ 30 న హైద‌రాబాద్‌లో, జ‌న‌వరి 2 బెంగుళూరు సిటీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: