పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. జక్కన్న నేతృత్వంలో చెర్రీ మరియు తారక్ కాంబోలో వస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. జనవరి 7 న ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ జక్కన్న పని రాక్షసుడు, ఆయన అనుకున్న షాట్ అనుకున్నట్లు వచ్చే వరకు కూడా ఆశ్శలు సంతృప్తి అవ్వరు ఎన్ని టేక్స్‌ అయినా చెబుతూనే ఉంటారు.

పర్ఫెక్షనిస్ట్‌ అంటే ఆయనే గుర్తొస్తారు'' అని తారక్‌, చెర్రీ అన్నారు. ఇక ఈ సినిమాను ఎంతో అందంగా అద్భుతంగా జక్కన్న మలిచారని.. ఈ చిత్రంలో సరికొత్తగా మేము కనబడతామని..నిజానికి ''మా ఇద్దరి కంటే మా గురించి బాగా దర్శకుడు రాజమౌళికే తెలుసు అని వారు అన్నారు. కాబట్టే మమ్మల్ని ఈ అద్భుతమైన సినిమాలో భాగం చేయగలిగారు. చెర్రీ మాట్లాడుతూ  ఈ సినిమా నాకు చాలా చాలా ప్రత్యేకం..ఈ చిత్రం లో నటించడం వల్ల మొదటిసారి నాకు నేను ఎంతో వైవిధ్యంగా బలంగా, బలమైన పాత్రలో గంభీరంగా కనిపించాను.

అయితే ఇప్పుడు అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమా జనవరి 7 న రిలీజ్ కావడం అనుమానంగానే ఉంది. దీనికి కారణం ఏపీలో ప్రభుత్వం తగ్గించిన సినిమా థియేటర్ల టికెట్ల ధరలే కారణం. ఆ ధరలతో మేము థియేటర్లను నడపలేమని యాజమాన్యాలు థియేటర్లను మూసివేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తీరుపై సినిమా ఇండస్ట్రీ అంతా విమర్శలు చేస్తున్నారు. ఇది ఇంకా ఎంత దోరం వెళుతుందో తెలియని పరిస్థితి. ఈ థియేటర్ల సమస్య వలన ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు వణుకు పుడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: