ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై రూపొందనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన కొన్ని నెలల కృతమే వచ్చింది. గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ని మించేలా మరింత అద్భుతంగా ఈ మూవీ కథ, స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట కొరటాల శివ. ఇటీవల ఈ సినిమా కథని ఎన్టీఆర్ కి వినిపించి ఓకే చేసిన అనంతరం ప్రస్తుతం తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ పనులు మొదలెట్టారట కొరటాల. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మార్చి మొదటి వారంలో గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానుండగా దీనికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు టాక్.
అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా సమంత నటించనుందని, కొద్దిరోజుల క్రితం హీరోయిన్ పాత్ర కోసం సమంత కి స్క్రీన్ టెస్ట్ చేసిన దర్శకుడు కొరటాల, ఆమెను తీసుకునేందుకు సిద్ధం అయినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఆ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, ప్రస్తుతం మూవీ యూనిట్, హీరోయిన్ సహా ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక కార్యక్రమం మొదలెట్టిందని, ఒకవేళ వాళ్ళు అందరూ ఓకే అయితే తామే అధికారికంగా ప్రకటిస్తాం అని, అప్పటి వరకు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని యూనిట్ వెల్లడించినట్లు సమాచారం. దీనితో ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం అవుతున్న వార్తలకు అడ్డు కట్ట పడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి