ప్రస్తుతం అన్ని సీని పరిశ్రమలు పాన్ ఇండియా మూవీలు, లైఫ్ స్టోరీ సినిమాలు తీస్తున్నారు. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బహుబలి సినిమాతో రికార్డులు సృష్టించిన ప్రభాస్.. సినీ కెరియరే మారిపోయింది. బహుబలి సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రభాస్‌కు ఓ రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. ఆయన మార్కెట్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతోపాటు అన్ని సౌత్ ఇండియా భాషలోనూ అసాధారణంగా పెరిగిపోయింది. దీంతో ఆ రేంజ్ పాపులారిటీ సాధించాలని స్టార్ హీరోలు సైతం అదే బాట పడుతున్నారు.


ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు ప్రభాస్ రేంజ్ పెరిగింది. హీరోలకు పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ రావడం కోసం.. అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఇదే బాట పట్టారు. స్టార్ డమ్ రావాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ మూవీ పాన్ ఇండియన్ సినిమాకు కొంత వరకు ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకున్నట్లు బన్నీ అభిమానులు చెప్పుకుంటున్నారు. కానీ, అల్లు అర్జున్‌కు సంతృప్తి కలగడం లేదని, ఈ సారి భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచే దర్శకుడు సుకుమార్‌తో కలిసి పుష్ప పార్ట్-2 సినిమాని ప్రారంభించబోతున్నారు. అయితే, దీనికంటే మంచి ప్రాజెక్టును త్వరలో ప్రారంభిచనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ యాక్షన్, ఫ్యామిలీ, లవ్ సినిమాలు తీయగా.. పుష్ప సినిమాతో తనలోని మరో నటన కోణాన్ని చూపించాడు. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: