అయితే పుష్ప పార్ట్ 1లో దాక్షాయణి పాత్రకు స్కోప్ తక్కువ ఉన్నా.. సెకండ్ పార్ట్‌లో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఇక అనసూయకు రంగమ్మత్త పాత్ర వచ్చాక ఇప్పుడు వెండితెరపై ఆమెకు క్రేజీ అవకాశాలను అందుకుంటుంది. అంతేకాదు.. బుల్లితెరపై ఆమె ఎప్పుడూ తన హాట్ అందాలు, స్వీట్ వాయిస్‌తో తన ప్రోగ్రామ్స్ రేటింగ్‌లు దుమ్ము దులిపించేస్తుంది. ఇక మూడున్నర పదుల వయస్సులో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ కుర్ర, క్రేజీ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా నటిస్తుంది.
యాంకర్ అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికి తెల్సిందే. ఆమె భర్త గురించి బయటకు పెద్దగా ఏ విషయాలు బయటికి రావు. అనసూయ భర్త పేరు భరద్వాజ్. అయితే అనసూయ కాలేజ్ చదివేటప్పుడే సుశాంక్ భరద్వాజ్‌తో ఎన్సీసీ క్యాంప్‌లో ఏర్పడిన పరిచయంతో అతడితో ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది. వారిద్దరూ పెద్దలను ఒప్పించి వీరు ఒక్కటైయ్యారు.
ఈ దంపతులకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనసూయ ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి చెప్పుకొచ్చింది. ఆమె భర్త ఆయన ఫైనాన్షియర్ అని, అలాగే ఫండింగ్ ప్లానర్ అని తెలిపింది. అంతేకాదు.. గతంలో అనసూయ తన భర్తను ఓ బుల్లితెర ప్రోగామ్ ద్వారా అందరికి పరిచయం చేసిన సంగతి అందరికి తెల్సిందే. ఇక సోషల్ మీడియాలో తరచూ తన గురించి ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో తాను చాలాసార్లు బాధ పడ్డానని అయితే.. తన భర్త ప్రోత్సాహంతో వాటిని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది ఈ భామ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి