పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నుంచి 'భీమ్లా నాయక్' సినిమా రాబోతుంది. ఈ సంక్రాంతికి రావల్సిన ఈ సినిమా కరోనా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత 'హరిహర వీరమల్లు' అనే సినిమాతో పవన్ కళ్యాణ్ రానున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కరోనా తగ్గుముఖం పట్టాక మళ్లీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు.

సుమారు 180 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు 'హీరో' సినిమా తో నిధి అగర్వాల్ ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల నిధి అగర్వాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరిహర వీరమల్ల సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ఈ సినిమా పూర్తి పీరియాడికల్ సినిమానే అయినా రెండు కాలాల్లో జరిగే కథ ఇది అంటూ తెలిపింది. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ముడిపెడుతూ ఈ సినిమా ఉండబోతోందని చెప్పింది.

అయితే తాజా సమాచారం ప్రకారం నిధి అగర్వాల్ చెప్పినట్టు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ టీజర్ తో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సినిమాలో రెండు పాత్రల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని తెలియడంతో మరోసారి సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: