అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్, కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో మంచి పేరు తీసుకువచ్చింది,  ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది,  ఇలా కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది, పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాలలో నటిస్తుంది. 
 అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ ఎంపికైంది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది ఈ ఫోటో కాజల్ అగర్వాల్ క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ లు వేసుకొని డీసెంట్ గా ఫోటోలకు తెలిసివచ్చింది ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: