తమిళంలో ఆయనో డైరక్టర్.. అతనిలో నటుడిని చూశారు తెలుగు దర్శకులు. డైరక్టర్ గా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టి నటుడిగా కొత్త అవతారం ఎత్తిన ఆయన్ను తెలుగు దర్శకులు వరుస అవకాశాలతో నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు కూడా మంచి ఫలితాలు రాబట్టడం తో అతని క్రేజ్ పెరిగింది. ఒతకీ అతనెవరో కాదు దర్శక నటుడు సముద్రఖని. తమిళంలో అతను డైరక్టర్ గా మంచి సినిమాలు చేశాడు. అక్కడ డైరక్టర్ గా చేస్తూనే తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. తెలుగు లో తనకు వస్తున్న ఈ ఆఫర్లతో రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్నాడు సముద్రఖని. ప్రస్తుతం ఆయన రోజుకి 7 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. తెలుగు లో గొప్ప నటులు ఉన్నా సరే వాళ్లని పక్కన పెట్టి తమిళ నటుడికి అంత ఇచ్చి తీసుకుంటున్నారే తప్ప ఇక్కా వాళ్లకి మాత్రం అవకాశాలు ఇవ్వట్లేదు.

అయితే తనకు ఇచ్చే రెమ్యునరేషన్ కి సముద్రఖని పూర్తి న్యాయం చేస్తున్నారు. అయితే రోజుకి 7 లక్షల రెమ్యునరేషన్ అంటే మాత్రం ఎక్కువే అని అంటున్నారు. రాబోతున్న సినిమాల్లో కూడా ఆయనకు మంచి పాత్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సముద్రఖని తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. తెలుగులో ఆయన చేస్తున్న సినిమాలు చూసి సముద్రఖనికి తమిళంలో కూడా నటుడిగా ఛాన్సులు వస్తున్నట్టు తెలుస్తుంది. రోజుకి 7 లక్షలు తీసుకుంటున్న సముద్రఖని హిట్లు పడితే మళ్లీ తన రెమ్యునరేషన్ పెంచే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు. సముద్రఖని డైరక్టర్ నుండి నటుడిగా టర్న్ తీసుకున్నాడు. అయితే అది ఆయన కెరియర్ కు ఉపయోగపడుతుంది. తెలుగులో ఈమధ్య వస్తున్న అన్ని సినిమాల్లో ఆయన నెగటివ్ రోల్స్ తో అలరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: