కింగ్ నాగార్జున మరోసారి సంక్రాంతి సెన్సేషన్ గా మారాడు. ఆయన నటించి నిర్మించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సొగ్గాడే చిన్ని నాయనా మూవీకి సీక్వల్ ప్రాజెక్ట్ గా వచ్చిన బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తుంది. సంక్రాంతి పండుగకి అసలైన పండుగ శోభ తెచ్చిన సినిమాగా మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేసింది బంగార్రాజు. ఈ సినిమా రిలీజ్ విషయంలో నాగార్జున చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బాగా వర్క్ అవుట్ అయ్యింది.

బంగారాజు సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటించి మెప్పించాడు. సినిమాలో చైతు పర్ఫార్మెన్స్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. బంగార్రాజు, చిన్న బంగార్రాజు పాత్రల్లో నాగార్జున, నాగ చైతన్య అక్కినేని అభిమానులతో పాటుగా సినీ ప్రియులను అలరించారు. ఇక బంగార్రాజు సినిమా ఓపెనింగ్ డే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా ఫస్ట్ డే 17.5 కోట్లు గ్రాస్.. రెండో రోజు 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా అదే ఊపుతో థర్డ్ డే 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కరెక్ట్ టైం కు కరెక్ట్ సినిమా అనేలా బంగార్రాజు క్లియర్ హిట్ జోన్ లోకి వచ్చింది.

పోటీగా వచ్చిన హీరో, రౌడీ బాయ్స్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం కాగా బంగార్రాజు కేవలం 3 రోజుల్లోనే 55 కోట్లకు మించి గ్రాస్ కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఓ విధంగా నాగార్జున లాస్ట్ మినిట్ లో బంగార్రాజు రిలీజ్ పై తీసుకున్న ఈ క్రేజీ డెశిషన్ ఆయనకు బాగా హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. బంగార్రాజు వేరే సీజన్ లో రిలీజ్ అయితే రిజల్ట్ ఎలా ఉండేదో కానీ 2016లో వచ్చిన సోగ్గాడే హిట్ ని రిపీట్ చేస్తూ బంగార్రాజు బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. నాగ్, చైతు కలిసి నటించిన బంగార్రాజు వీరి హిట్ సెంటిమెంట్ కూడా రిపీట్ అయ్యేలా చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: