ఈ ఏడాది మొదటి వారంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తేలింది. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలియజేయడం జరిగింది. అయితే తక్కువ లక్షణాలు ఉన్నాయి కానీ అన్ని విధాలా రక్షణ ఉండే విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలియజేసింది.అలా ఒక ఏడు రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉన్నది. ఇప్పుడు తాజాగా కరోనా నుంచి కోలుకున్నట్లుగా తన ట్విట్టర్ ఖాతా నుంచి నెగిటివ్ వచ్చిందనే విషయాన్ని తెలియజేసింది కీర్తి సురేష్.


ఇన్నిరోజులు మీరు నా పై చూపించిన ప్రేమ , ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ తెలియజేస్తోంది. అందరూ సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకొని వుంటారని ఆశిస్తున్నానని తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది.కరోనా నుంచి బయట పడిన తర్వాత తన సరికొత్త ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె అభిమానులు ఈ గుడ్ న్యూస్ విన్న వెంటనే నెటిజన్లు ఆమె ఫోటోలకు లైక్ కొడుతున్నారు. మహానటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది కీర్తి సురేష్. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి విజయవంతమైంది. కానీ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి ఈ ముద్దుగుమ్మకు. ప్రస్తుతం ఈమె ఆశ అంతా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాపైనే పెట్టుకుంది.ఈ సినిమాలో కీర్తి సురేష్ రోల్ చాలా అబ్బుర పరిచే విధంగా ఉంటుందట.

ఇక మరొక వైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తన సోదరి గా నటించనుంది.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తన సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళుతోంది కీర్తి సురేష్.. అంతే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా.. ఉంటోంది. అయితే ఈ ఏడాదైనా ఈమెకు బాగా కలిసొచ్చి వరుస సక్సెస్ లు కావాలని కోరుకుందాం. ప్రస్తుతం కీర్తిసురేష్ కరోనా నుంచి కోలుకున్న ఆనందంలో ఉంది. ఇక తాజాగా ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: