సినిమా ఇండస్ట్రీలో ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న.. కాస్త అదృష్టం కలిసి రావాలంటే దానికి ఎంతోమంది మన ఇండస్ట్రీలో ఉన్న నటులనే ఉదాహరణగా చెప్పవచ్చు.బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ కాలేకపోయిన నటీ నటులు ఉన్నారు. అలా మొదటిగా హీరోయిన్ గా వచ్చి.. ఆ తర్వాత తన అదృష్టం కలిసి రాక విలన్ గా మారి.. తన స్టార్డమ్ ను నిలబెట్టుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈమెకు హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ రాక పోగా తరువాత విలన్ గా కూడా నటించి.. ఆ స్టార్డమ్ ని నిలబెట్టిందని చెప్పవచ్చు.


అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంత ట్రై చేసినా సక్సెస్ కాకపోవడంతో తనకి ఎక్కువగా విలన్ అవకాశాలే వస్తూ ఉండటంతో వాటిని ఎక్కువగా చేసుకుంటూ, తన కెరియర్ లో ముందుకు సాగిస్తోంది.. ఇక  సినీ ఇండస్ట్రీలో తన తండ్రి కూడా ఒక నటుడే.. కానీ ఈమె హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఇక అలాంటి సమయంలో ఈమె నెగిటివ్ రోల్స్ వైపు తన దృష్టిని మళ్లించి కొని.. ఎక్కువగా అలాంటి పాత్రలే చేయడం వల్ల, ఈమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు.. ఇక ఈ కారణం చేతనే ఈమె ఇప్పుడు ఈ స్టార్ పొజిషన్లో ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.

అలా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలలో తెనాలి రామకృష్ణుడు, రవితేజ క్రాక్, నరేష్ నాంది వంటి సినిమాలలో తన విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. దీంతో తెలుగులో హీరోయిన్ల కంటే ఈమె బిజీగా మారిపోయింది. ఇక ఒక స్టార్ హీరో సినిమాలో విలన్గా కూడా కనిపించబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా సమంత యశోద సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తోంది.. అంతేకాకుండా  మైఖేల్ అనే మూవీ లో కూడా.. ఈమె పాత్ర చాలా కీలకమైనదట. ఇక ఈ ముద్దుగుమ్మ ఒకే సారి హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో కూడా విలన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: