కొంతమంది దర్శకులు సినిమాలు చేయకపోతే ఏదో వెలితిగా కనిపిస్తుంది. వారు తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి ఒకసారిగా కనుమరుగై పోతే తప్పకుండా దర్శకుడి అభిమానులు నిరుత్సాహ పడతారు. ఆయన తదుపరి సినిమా పట్ల ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా తెలుగులో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు శివ. తమిళ సినిమా పరిశ్రమలో ఇప్పుడు భారి స్థాయిలో సినిమాలు చేస్తూ అక్కడ అగ్ర దర్శకుడు గా ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు తెలుగులో అసలు సినిమా చేయకపోవడం ఒక్కసారిగా ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది.

గోపీచంద్ హీరోగా నటించిన శౌర్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు శివ. ఆ తర్వాత శంఖం సినిమా చేసి ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాడు ఈ దర్శకుడు. తమిళంలో సినిమాలు చేయడం మొదలు పెట్టిన తర్వాత తెలుగులో అసలు సినిమాలు చేయడం లేదనే చెప్పాలి. అయితే ఆయన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్న కూడా తెలుగు ప్రేక్షకులకు ఏదో ఒక సంతృప్తి ఆయనను వెంటాడుతూనే ఉంది. ఈ దర్శకుడు తెలుగు హీరోతో సినిమా చేస్తే చూడాలి అనేది తెలుగు అభిమానుల కోరిక .

ఈ నేపథ్యంలో పెద్దన్న అనే సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు తెలుగు హీరోతో సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే మళ్లీ ఆయన అజిత్ తో సినిమా చేయడానికి ముందుకు వెళ్ళడంతో మరొకసారి తెలుగు ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు. మరి భవిష్యత్తులోనైనా ఈ దర్శకుడు తెలుగు సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టకుంటాడా అనేది చూడాలి. ఇప్పటికే అజిత్ తో కలసి మూడు సినిమాలు చేసే ఆయనకు భారీ స్థాయిలో హిట్ అందించిన శివ ఇప్పుడు ఈ నాలుగు సినిమా ఎలా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: