ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బీభత్సరమైన క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లో పుష్ప రాజ్ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాలో డైలాగ్స్, సాంగ్స్ అన్ని దేశమంతటా వైరల్ గా మారాయి. ఈ క్రమంలో పుష్ప సినిమాలో తను చేయాల్సిన ఒక పాత్ర వేరే వాళ్లు చేశారని చెప్పి షాక్ ఇచ్చాడు మహేష్ విట్టా. పుష్ప సినిమాలో కేశవ పాత్ర చేశాడు జగదీష్. సినిమా అంతా పుష్ప రాజ్ తో ఉంటూ జగదీష్ ఈ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

వెబ్ సీరీస్ లు చేస్తూ కెరిఊర్ బిల్డ్ చేసుకుంటున్న జగదీష్ పుష్ప సినిమాలో కేశవ పాత్రతో సత్తా చాటాడు. కేశవ పాత్రకి ఆడిషన్స్ చేసిన టైం లో మహేష్ విట్టా కూడా పాల్గొన్నాడట. ఫన్ బకెట్ తో క్రేజ్ తెచ్చుకున్న మహేష్ విట్టా ఆ తర్వాత సినిమా ఛాన్సులు అందుకున్నాడు. పక్కా రాయలసీమ యాసతో మాట్లాడే మహేష్ విట్టా అయితే కేశవ పాత్రలో అదిరిపోయేది. ఆడిషన్స్ ఇచ్చిన టైం లో కూడా మహేష్ ఆ పాత్ర దాదాపు తనకే అనేలా ఫీల్ అయ్యాడట.

అయితే ఆ పాత్ర తనకి కాకుండా జగదీష్ కి ఇచ్చారని. కేశవ పాత్రలో జగదీష్ కూడా చాలా బాగా చేశాడని అన్నాడు మహేష్ విట్టా. ఇక చిత్తూరు యాసలో అల్లు అర్జున్ కూడా చాలా బాగా చేశారని. ఆయన చెప్పిన డైలాగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయని అన్నారు. ఇక శ్రీవల్లి పాత్ర కూడా రష్మిక బాగా చేసిందని అన్నాడు మహేష్ విట్ట. గొప్ప సినిమాలో అవకాశం రానందుకు ఫీల్ అవుతున్నా ఇది మిస్సైనా మరో మంచి ఛాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మహేష్ విట్టా. తనదైన శైలిలో ఆడియెన్స్ ని అలరించడానికి ప్రయత్నిస్తున్న మహేష్ విట్టాకి మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: