విజయ్ దేవరకొండ భారీ హోప్స్‌ పెట్టుకున్న సినిమా 'లైగర్'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందుతోందీ 'లైగర్'. బాక్సింగ్ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ ఒక స్పెషల్‌ రోల్ ప్లే చేశాడు. ఇక మైక్‌ టైసన్ ఎంట్రీతో లార్జ్‌ స్కేల్‌గా మూవీగా మారిన 'లైగర్‌'లో ఫారెన్‌ స్టంట్‌ మాస్టర్ ఫైట్స్‌ కంపోజ్‌ చేశాడు. 'రాబిన్‌హుడ్‌, పోలీస్‌ స్టోరి: లాక్‌డౌన్' లాంటి సినిమాలకి వర్క్‌ చేసిన యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్‌ 'లైగర్'కి పని చేస్తున్నాడు.

వరుణ్‌తేజ్ ఫిజికల్‌గా చాలా కష్టపడి చేసిన సినిమా 'గని'. బాక్సింగ్‌ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ హల్క్‌లా మారాడు. ఇక ఈ మూవీని హాలీవుడ్‌ లెవల్‌లో చూపించాలని ఫారెన్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. హాలీవుడ్‌ స్టంట్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టావల్, వ్లాద్‌ రింబర్గ్‌ 'గని' యాక్షన్‌ సీన్స్ డైరెక్ట్ చేశారు.

'బాహుబలి' తర్వాత రాజమౌళి ఆలోచనలు నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాయి. 'ట్రిపుల్ ఆర్' తర్వాత జక్కన్న వరల్డ్‌ క్లాస్ పిక్చర్ తీస్తాడని చాలా రోజల నుంచి ప్రచారం జరుగుతోంది. వాటికి బలమిస్తూ 'ట్రిపుల్ ఆర్' నుంచే ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని ఫోకస్ చేస్తున్నాడు జక్కన్న. ఈ హిస్టారికల్ డ్రామాకి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా నిక్‌ పావెల్‌ని తీసుకొచ్చాడు. 'గ్లాడియేటర్, ది బౌర్న్ ఐడెంటిటి' లాంటి మూవీస్‌కి వర్క్‌ చేశాడు నిక్ పావెల్. ప్రభాస్ రీజనల్‌ స్టార్‌ నుంచి పాన్‌ ఇండియన్‌ హీరోగా మారి చాలా కాలమైంది. ఇక నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్ డ్రామా అయితే హాలీవుడ్‌ రేంజ్ మూవీ అని చెప్తున్నారు. ఇక ప్రభాస్‌ కరెంట్ ప్రాజెక్ట్ 'రాధేశ్యామ్' కూడా ఇదే లెవల్‌లో రూపొందుతోంది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిక్‌ పావెల్‌ స్టంట్‌ కొరియోగ్రఫీ చేశాడు. ఇక ప్రభాస్‌ లాస్ట్ మూవీ 'సాహో'కి ఫారెన్‌ స్టంట్‌ మాస్టర్ కెన్నీ బేట్స్‌ ఫైట్స్ కంపోజ్ చేశాడు.

చిరంజీవి చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని చేసిన సినిమా 'సైరా'. తొలితరం స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కిందీ సినిమా. కథ నుంచి రిలీజ్ వరకు చిరు మెగా ఇంట్రెస్ట్‌ పెట్టిన ఈ మూవీకి గ్రెగ్‌ పావెల్ స్టంట్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ బ్రిటన్ స్టంట్‌ మాస్టర్ 'విల్లో, సహారా' లాంటి సినిమాలకి వర్క్ చేశాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: