గత కొన్ని రోజులుగా గమనిస్తే నాని అతి తక్కువ సమయంలోనే తన సినిమాలను వరుసగా విడుదల చేస్తున్నారు. అది ఓ టి టి లో విడుదల చేస్తున్నాడా లేదా థియేటర్లో విడుదల చేస్తున్నాడా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన తన సినిమాలను విడుదల చేస్తు భారీ స్థాయిలో సంతోష పరుస్తున్నాడు. టక్ జగదీష్ అలాగే శ్యామ్ సింగ రాయ్ చిత్రాలను గత ఏడాది విడుదల చేసిన నాని అంతకుముందు ఏడాది కూడా ఈ సినిమాను విడుదల చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.
అంతే కాదు ఈ సంవత్సరం కూడా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన అంటే సుందారనికి దాదాపుగా పూర్తి కావచ్చింది. తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలి అనేది ఆయన ఆలోచన. అంతేకాదు ఈ చిత్రం తమిళ మలయాళ భాషల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో ఇప్పుడు ఆయా భాషలలో కూడా తన సినిమాను విడుదల చేస్తున్నాడు నాని. ఇంకోవైపు దసరా సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలు కాగా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయింది అని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి