చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రతి పాత్రలోను లీనమైపోయి నటిస్తుంటాడు. ఇక ఆయన నటించే సినిమాలు ఆల్ మోస్ట్ ఆల్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు.. ఆయన ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నాడు. అయితే ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ ను సొంతం చ్జేసుకున్నా కానీ ఆయనకు నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఎలాగానో మళయాలంలో మోహన్ లాల్ అలా అన్నమాట. మలయాళ ఇండస్ట్రీలో మోహన్ లాల్ కి ప్రత్యేకమైన హోదా ఉంది. వాస్తవానికి మోహన్ లాల్ సూపర్ స్టార్ హోదాలో ఉన్నప్పటికీ నేను ఇలాంటి సినిమాలోనే నటించాలి..నా పాత్ర ఇలాగే ఉండాలి అని గిరి గీసుకోకుండా .. కథ కే అధిక ప్రాధాన్యత ఇస్తూ..సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే..ఆయన ఆ కధలో  ప్రాముఖ్యత ఉన్న అలాంటి సినిమాలకు మాత్రమే ఒప్పుకుంటున్నారు.

అంతేకాదు.. మోహన్ లాల్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ వంటి పలు భాషల్లో నటించిన ఘనత ఈతరం నటుల్లో లాల్ కే సొంతం అని చెప్పాలి మరి. అయితే మోహన్ లాల్ సినిమాలో సంపాదించిన డబ్బునంత కూడా పలు వ్యాపారలల్లో పెట్టుబడిగా పెట్టారు. ఇక సినిమాల్లో సంపాదించిన డబ్బు ను మొత్తం మళ్ళీ సినిమా నిర్మాణం లో పెట్టి ప్రణవం ఆర్ట్స్ బ్యానర్లో పలు అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు.

ఇండస్ట్రీలో మోహన్ లాల్ కేవలం సినిమా ప్రొడ్యూసర్ గానే కాకుండా, విజ్యుల్ ఎఫెక్ట్స్ కంపెనీ, మీడియా, నిర్మాణం, రియల్ ఎస్టేట్, హోటల్, బ్రాండెడ్ దుస్తుల బిజినెస్ లతో పాటుగా , పలు ప్రముఖ కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో వాటాలు ఉన్నాయని సమాచారం. ఆయన ఆస్తి కొన్ని కోట్లా విలువలతో ఉంది. ఇక మోహన్ లాల్ కి కేరళ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యంత విలువైన గృహాలు ఫార్మ్ హౌస్ లు ఉన్నట్లు సమాచారం. ఆయనకి కోట్లా ఆస్తి ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: