భర్తలు నటులుగా భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకుంటున్న వారి భార్యలు సైతం తామేమీ తక్కువ కాదు అన్నట్లుగా వాళ్ళు కూడా పలు విభాగాల్లో పనిచేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఈ మధ్య భారత దేశంలో ని అన్ని ఇండస్ట్రీలలో నటుల భార్యలు సైతం ఇంటికే పరిమితం కావడం లేదు సంపాదన మీద దృష్టి సారించి నూతనంగా ఆలోచిస్తున్నారు.

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో
హీరో మరియు ప్రతినాయకుడిగా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న బడా వ్యాపారవేత్త మరియు నటుడైన
కోలీవుడ్ స్టార్
హీరో అరవింద్ స్వామి భార్య అపర్ణ ముఖర్జీ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసుకోవాలని ఉందా,
ఆమె వృత్తి జీవితం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉందా .ఆమె సంపాదన చూస్తే మీరు ఆశ్చర్య పోతారు.

అరవింద్ స్వామి
భార్య అపర్ణ ముఖర్జీ భారత దేశంలో నే ప్రముఖ మహిళా న్యాయవాదుల్లో ఒకరు.
అపర్ణ జాతీయ న్యాయ కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేసి తొలుత జూనియర్ న్యాయ వాది గా అనంతరం మద్రాస్ హైకోర్టు లో న్యాయవాది గా పనిచేశారు .న్యాయవాదిగా ముఖ్యంగా ఆమె మధ్యవర్తిత్వం విభాగంలో ఆరితేరిన నిపుణురాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ దేశానికి చెందిన కోర్టులో అయినా వాదించేందుకు ఆమె లైసెన్స్ కలిగి ఉన్నారు.

దేశంలోనే పలు బడా పారిశ్రామిక వేత్తలకు, పలు కార్పోరేట్ కంపెనీలకు ఆమె ప్రత్యక్షంగా గాని పరోక్షంగా సేవాలందిస్తున్నారు. అంతేకాకుండా
భర్త అరవింద్ స్వామికి చెందిన పలు కంపెనీల బోర్డు ల్లో
డైరెక్టర్ గా, బయట కంపెనీల్లో లీగల్ సలహాదారు గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. నెలకు 30 నుండి 40 కోట్ల వరకు ఆమె సంపాదిస్తున్నారు అని వినికిడి. రానున్న రోజుల్లో ఆమె స్వయంగా ఒక లీగల్ కంపెనీ ని ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని
కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.