గత కొన్నిరోజులుగా ఎన్టీఆర్ పరశురామ్ కాంబో మూవీకి సంబంధించి వార్తలు తెగ ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో పరశురామ్ చాలా బిజీగా ఉన్నారు.

సినిమా తర్వాత నాగచైతన్య పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.. అయితే ఈ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించాలని పరశురామ్ భావిస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం వార్త అందుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం కథల ఎంపికలో మరియు డైరెక్టర్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే.


టెంపర్ సినిమాకు ముందు వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్న తారక్ ఆ పొరపాటు రిపీట్ కాకూడదని భావిస్తున్నారట.. ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజయ్యే ప్రతి సినిమా కూడా ఆ సినిమా స్థాయిలో సక్సెస్ సాధించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారట.. నిదానమే ప్రధానం అని భావిస్తూ ప్రాజెక్టుల ఎంపిక మరియు దర్శకుల ఎంపిక విషయంలో తారక్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారట.. సర్కారు వారి పాట హిట్టైతే మాత్రమే పరశురామ్ డైరెక్షన్ లో తారక్ హీరోగా సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండటం విశేషం.

 అల్లు అరవింద్ వరుసగా నందమూరి హీరోలతో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం.. అల్లు కాంపౌండ్ నిర్మాణంలో తెరకెక్కే సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఓటు వేస్తారో లేదో మరి చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ పూజా కార్యక్రమం వాయిదా పడిందని కూడా వార్తలు వస్తున్నాయి. మార్చి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని వార్త అందుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయిన అలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారట.. ఈ సినిమా కొరకు అలియా కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకున్నారని వార్త అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: