ఊ..అంటావా.. ఊహూ.. అంటావా పాట ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే.. ఈ పాట ఆలిండియా స్థాయిలో మంచి పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ పాటకు ఎన్ని పేరడీలు వచ్చాయో.. అంతే కాదు.. యూట్యూబ్‌లోనూ ఈ పాట సంచలనం సృష్టిస్తోంది. రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. చక్కటి సాహిత్యానికి సమంత అందాల ఆరబోత ప్లస్ పాయింట్ అయ్యింది.


అయితే.. ఈ పాటకు సంబంధించిన ఓ విశేషాన్ని ఇటీవల పాట రచయిత చంద్రబోస్‌ బయటపెట్టారు. ఈ పాట పుష్ప సినిమాలోదన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పాటను మొదట రాసింది మాత్రం పుష్ప సినిమా కోసం కాదట.. సాధారణంగా సుకుమార్ ప్రతి సినిమాలోనూ ఓ ఐటమ్‌ సాంగ్‌ ప్లాన్ చేస్తారు కదా.. అలాగే రంగస్థలంలోనూ ఓ పాట ప్లాన్ చేశారు. దాని కోసం నాలుగైదు వెర్షన్లు రాయమన్నారట. అప్పుడు రంగస్థలం కోసం ఈ ఊ..అంటావా.. మావా.. ఊహా అంటావా.. మావా పాట రాశారట చంద్రబోస్..


పాట అద్భుతంగా వచ్చినా.. దాన్ని మరి రంగ స్థలంలో ఎందుకు పెట్టలేదో తెలుసా.. రంగస్థలంలో అప్పటికే ఆ గట్టునుంటావా.. నాగన్న.. ఈ గట్టునుంటావా.. అన్న పాట ఉంది కదా.. అక్కడ ఉంటావా.. ఇక్కడ ఉంటావా అన్న తరహాలో ఉంటుందాపాట.. ఈ ఊ..అంటావా.. ఊహూ అంటావా అన్న పాట కూడా అలా ఆప్షన్ ఇచ్చే తరహాలోనే ఉంటుంది కదా.. రెండు పాటలూ అదే తరహాలో ఉంటే ఎలా అని ఆలోచించి ఊ అంటావా పాట ఆపేశారట. అప్పుడు ఊ అంటావా పాట స్థానంలో జిగేల్‌ రాణి పాట వచ్చింది.


అయితే.. ఈ ఊ.. అంటావా పాటను మాత్రం ఎవరికీ ఇవ్వవద్దని.. మళ్లీ తానే వాడుకుంటానని సుకుమార్ పట్టుబట్టారట. అలా ఆ పాటను నాలుగేళ్ల పాటు కాపాడుకుని మళ్లీ ఇప్పుడు పుష్పలో వాడారట. ఇలా ఆపడం వల్ల మంచే జరిగిందని.. పుష్ప పాన్ ఇండియా మూవీ కావడంతో ఇప్పుడు మరింత ప్రాచుర్యం లభించిందని అంటున్నారు పాట రచయిత చంద్రబోస్.. అవును.. కదా.. ఇంతకీ మీరు ఊ.. అంటారా.. ఊహూ.. అంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: