సినీ ఇండస్ట్రీలో ఇప్పుడొస్తున్న హీరోయిన్లు గ్లామరస్ పాత్రలకే పరిమితం అవుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ తమ అందాలను ఆరబోస్తున్నారు. గ్లామరస్ పాత్రలు చేస్తేనే ఇండస్ట్రీలో రాణించగలమంటున్న భ్రమలో ఉన్నారు ఇప్పటి హీరోయిన్లు. ఇప్పుడే ఇలా ఉందంటే రానున్న రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఉండే కొందరు హీరోయిన్లు ఇంకేం చూపిస్తారో అన్నట్లుగా ఉంది. అయితే హీరోయిన్ అంటే.. కేవలం గ్లామరస్ పాత్రలే కాదని కొందరు హీరోయిన్ తమ నటనతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సాయిపల్లవి, కీర్తి సురేశ్ తదితరులున్నారు. వీరు తమ నటనతో అభిమానులను మెపిస్తూ మంచి అవకాశాలు అందుకుంటున్నారు. కానీ మరి కొందరు ఒంటిపై బట్టలు తగ్గిస్తే తప్ప ఆఫర్లు రానట్లుగా ప్రవర్తిస్తున్నారు. పాపులారిటీ, డబ్బే ముఖ్యమన్న చందంగా రెచ్చిపోతున్నారు.


హీరోయిన్లకు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత హీరోయిన్లు తమ పాలొయింగ్ పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పూటకో హాట్ ఫోటోలు పెట్టి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అలా నెట్టిజన్ల నుంచి ట్రోలింగ్ బారిన పడుతున్నారు. అలా రీసెంట్‌గా అమీజాక్సన్‌పై కూడా జనాలు మండిపడుతున్నారు. దీనికి కారణంగా తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫోటోలు పెట్టడమే. పలు దక్షిణాది సినిమాల్లో నటించిన అమీ.. మరోసారి తన అందచందాలతో అదరగొడుతోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  



అమీజాక్సన్ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. రీసెంట్‌గా ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ ఇంటి బాల్కనీ నుంచి సూర్యుడిని చూస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే తన బెడ్రూంలో తన పరుపుపై ఎలా పడుకుంటుందో కూడా ఫోటోలు తీసి పెట్టింది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్‌పై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్యాంట్ వేసుకోకుండా కేవలం వైట్ టాప్, రెడ్ కలర్ అండర్ వేర్ ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయొద్దంటూ సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: