మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఖైదీ నెంబరు 150 సినిమాతో సినిమాల్లొకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిసినిమా తో ఘన విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తీ చేసి విడుదలకు సిద్ధంగా ఉంది.. ఆ సినిమా పై చిరంజీవి అభిమనుల్లొ భారీ అంచనాలు ఉన్నాయి.. అయితే ఈ సినిమా విడుదల కూడా కరోనా కారణంగా వాయిదా పడింది.


సినిమా తర్వాత ఇప్పుడు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు చిరు.153వ సినిమాగా రాబోతున్న లూసీఫర్ రిమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్‌లో చిరంజీవి ఇప్పటికే పాల్గొంటున్నారు. ఇక ఆయన తదుపరి చిత్రం డైరెక్టర్ బాబీ కలయికలో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.ఆ సినిమా కూడా మాస్ లుక్ లో కనిపిస్తూ చిరంజీవి అలరించనున్నాడు.మాస్ గెటప్‌ని రివీల్ చేశారు మేకర్స్. అయితే టైటిల్ కూడా అప్పుడే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ ఈ టైటిల్ ను ఇంక ఫిక్స్ కాలేదు. అందుకే టైటిల్ ను చెప్పకుండా కేవలం 154 అని పోస్టర్ ను విడుదల చేశారు.


ఫస్ట్ ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని అనుకున్నారట. కానీ ప్రస్తుతం ఆ పేరును మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేక పోలేదు.. హీరో సుమంత్ నటిస్తున్న వాల్తేరు శీను అని పెట్టడమే అని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య కాకుండా వాల్తేరు మొనగాడు అనే టైటిల్ ను ఖరారు చెస్తె బాగుంటుందనే ఆలోచనలో డైరెక్టర్ బాబీ ఉన్నారని తెలుస్తుంది. అయితే చిరు బ్రాండ్ కు తగ్గట్లు మంచి టైటిల్ ను ఫిక్స్ చేయాలనీ మెగాస్టార్ అన్నారు..మరి ఆ సినిమాకు ఎటువంటి టైటిల్ ను పెడతారు అనేది ఆసక్థిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: