ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రాల్లో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా కూడా ఒకటి. 2018 సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలలో లగడపాటి శ్రీధర్ కూడా ఒకరు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ అనేది సినిమాలను నిర్మించడానికి చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఇతర భాషల సినిమాలపై మన దర్శకులకు ఆసక్తి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. పెళ్లి చూపులు, నిన్ను కోరి సినిమాలు గత కొన్ని నెలల్లో తనకు బాగా నచ్చాయని వెల్లడించారు.ఇక తనకు ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్లడం చాలా ఇష్టమని పేర్కొన్నారు లగడపాటి శ్రీధర్. ఇక తాను ఎక్కడికి వెళితే అక్కడ సినిమాలు చూస్తా అని.. కమర్షియల్ సినిమాల కంటే యాక్షన్, హ్యూమర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆయన.ఇక ఇప్పటి వరకు తాను నిర్మించిన సినిమాలలో ఎవడిగోలవాడిది, స్టైల్ సినిమాలు సక్సెస్ సాధించాయని పేర్కొన్నారు.

అయితే అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాపై తాను పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదని లగడపాటి శ్రీధర్ వెల్లడించారు. అయినా కూడా ఆ సినిమా తనకు అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమాను ముందే చూసుంటే బాగుండేదని.. స్క్రీన్ ప్లే లో జరిగిన కొన్ని కొన్ని తప్పులు వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందని లగడపాటి శ్రీధర్ పేర్కొన్నారు. ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ వినగానే తనకు గూస్ బమ్స్ వచ్చాయని ఆయన వెల్లడించారు. ఇక నా పేరు సూర్య సినిమా రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం ఆ సినిమా ప్లాప్  అవ్వడానికి మరో కారణమని చెప్పుకొచ్చారు లగడపాటి శ్రీధర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: