ఇక అసలు విషయంలోకి వెళితే డీజే టిల్లు తెలుగు మూవీ ని ఓటిటి హక్కులను ఆహా సంస్థ దక్కించుకున్నది. ఇందుకు సంబంధించి ఆహా సంస్థ ఒక ప్రకటనలో కూడా విడుదల చేయడం జరిగింది.. త్వరలో ఆహాలో ఈ సినిమా విడుదల కాబోతోందని తెలియజేయడం జరిగింది. ఇక ఈ చిత్రం వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా ఒక పోస్టుర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ చిత్రం బుల్లితెరపై ఎలా అలరిస్తుందో చూడాల్సిందే. ఇక కేవలం ఈ సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తి అయిన వెంటనే ఆహాలో విడుదలవుతోంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను మాత్రం స్టార్ మా దక్కించుకుంది.
ఈ సినిమా ఎక్కువగా యువతని బాగా ఆకట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బిజినెస్ పరంగా కూడా భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది.. ఇక ఈ చిత్రం నైజాంలో 2.80 కోట్లు.. ఆంధ్ర 3.40 కోట్లు మొత్తం మీద 7.70 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.. ఇక దీంతో సిద్దు, నేహా శెట్టి కి మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి