సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఫిబ్రవరి నెలను ఆన్ సీజన్ గా భావిస్తూ ఉంటారు,  స్టార్ హీరోలు సినిమాలు ఈ నెలలో విడుదల చేయడానికి చాలా వరకు సహసించారు,  కానీ ప్రస్తుతం కారోనా ప్రభావం వల్ల సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితుల్లో స్టార్ హీరోలు కూడా ఫిబ్రవరి నెల పై దృష్టి పెట్టారు, అందు భాగంగా కొన్ని  సినిమాలు  ఈ ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యాయి,  మరి అందులో ఎ సినిమాలు విజయాలను సాధించాయి... ఎ సినిమాలు విజయాలను సాధించలేక పోయాయో మనం తెలుసుకుందాం.

ఖిలాడి... మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల అయ్యింది,  ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ ను సంపాదించుకొని, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

డీజే టిల్లు... సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఖిలాడి సినిమాకు పోటీగా ఫిబ్రవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

సన్ ఆఫ్ ఇండియా... కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల అయ్యింది, సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

భీమ్లా నాయక్... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది, విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్,  70 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లు తెలుస్తోంది,  ఇలా భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: