ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసేందుకు రెబల్ స్టార్ ఏకంగా ఓ థియేటర్ నే బుక్ చేశారట. తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ తో కలసి రేపు సినిమాను చూసేందుకు ముంబైలో ఓ లగ్జరీ థియేటర్ ప్రభాస్ పేరుపై బుక్ అయినట్లు బాలీవుడ్ మీడియా నుండి సమాచారం అందుతోంది. అయితే మొదట ఇక్కడ మన తెలుగులో సినిమాని ఆస్వాదించాలి అనుకున్న ప్రభాస్ ప్రస్తుత తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ పనిలో ముంబయిలో చాలా బిజీగా ఉన్న కారణంగా అక్కడే సినిమా చూడటానికి థియేటర్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అని తెలుస్తోంది.
ఇది ప్రస్తుతానికి ఒక గాసిప్ మాత్రమే. అయితే ఇందుల ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. కాగా రాధే శ్యామ్ సినిమా హిట్ అయితే ప్రభాస్ కు అదృష్టం పట్టినట్లే. మరి ఈ సినిమా ఫలితం ఎలా రాబోతోంది అని చిత్రబృందం మరియు ప్రభాస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరును తీసుకురావాలని ఆశిద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి