మొదటినుంచి తమిళ సినిమా పరిశ్రమలోని చిత్రాలకు తెలుగు సినిమా పరిశ్రమలోని చిత్రాలకు చాలా వైవిధ్యం ఉంటుంది. మన తెలుగు సినిమాల్లో కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అదే తమిళ సినిమాలలో నూటికి ముప్పై శాతం సినిమాలైన వైవిధ్యభరితమైన కథాకథనాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తూ ఉంటాయి.  ఆ విధంగా తెలుగు హీరోల కంటే తమిళ హీరోలు ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరు కూడా ఈ తరహా సినిమాలే ఎక్కువ చేస్తూ ఉంటారు. 

తెలుగు హీరోలు మాత్రం రిస్క్ ఎందుకులే అని ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ఎక్కడ ఫ్లాప్ వస్తుందేమోనన్న భయంతో వారు ఆ తరహా సినిమాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపరు దానికి తోడు అభిమానుల నుంచి ఒత్తిడి కూడా భారీ స్థాయిలో ఉంటుంది. హీరోలు నటించే సినిమాలో ఫైట్లు లేకపోయినా రొమాన్స్ లేకపోయినా అభిమానులు ఏమాత్రం ఒప్పుకోరు. ఆ విధంగా అభిమానులకు నచ్చే విధంగా అభిమానులు మెచ్చే విధంగా వారు తమ పాత్రలను సినిమాను చేస్తూ ఉంటారు.

ఎప్పుడో కానీ తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు రావు. అలా వచ్చిన కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచి కమర్షియల్ సినిమాల వైపు ఉంటుంది కాబట్టి వారు ఆ సినిమాను ఎక్కువగా ఆదరించరు. అలా ప్రేక్షకుల అభిరుచి మారకపోతే మాత్రం హీరోలు ఏం చేస్తారు. వారి అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ప్రధానమైన సినిమాలను చేస్తున్నారు. మరి తెలుగులో కూడా ప్రయోగాత్మక సినిమాల్లో తమ అభిమాన హీరోలను చూడాలనే కోరిక ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తొందర్లోనే ఈ హీరో లు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలను చేస్తారు అనేది చూడాలి. తమిళనాట ప్రతి ఒక్క హీరో కూడా అందరి ప్రేక్షకులను అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధమైన సినిమాలు చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: