ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు లోని ఐమాక్స్ ప్రముఖ థియేటర్ వద్ద కూడా ఒక బ్యానర్ కట్టేందుకు చల్ల కోటేశ్వరరావు అనే అభిమాని ఈ మూవీ బ్యానర్ కట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అతడు ప్రమాదవశాత్తు మరణించారు. అయితే అతని మరణం గురించి ఆ చెవిన ఈ చెవిన పడి చివరకు హీరో ప్రభాస్ వరకు వెళ్లింది. విషయం గురించి తెలుసుకున్న ప్రభాస్ వెంటనే ప్రమాదంలో మరణించిన కోటేశ్వర రావ్ భార్య పిచ్చమ్మ బ్యాంక్ ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేశారు. ఆ కుటుంబానికి కొంతైనా ఆర్ధిక సాయం అందించి అండగా నిలబడాలని ముందుకొచ్చారు.
అంతేకాదు నేరుగా ఆ కుటుంబానికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు ప్రభాస్ పరామర్శించి దైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. నిరుపేద కుటుంబ అయిన చల్ల కోటేశ్వరరావు కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలబడతానని వారికి దైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన రెబల్ స్టార్ అభిమానులు, ప్రేక్షక అభిమానులు, అందరూ కూడా ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి