‘బాహుబలి’ ఇచ్చిన ఇమేజ్ తో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ కు మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయి ఏకంగా 100 కోట్ల పారితోషికం తీసుకునే హీరోగా మారిపోవడంతో బాలీవుడ్ టాప్ హీరోలు కూడ షాక్ అయ్యారు. ‘సాహో’ తెలుగు రాష్ట్రాలలో పరాజయం సాధించినా బాలీవుడ్ లో మాత్రం విజయం సాధించడంతో ఇక ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ కు ఎదురులేదు అనుకున్నారు అంతా.


అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘రాథే శ్యామ్’ విషయంలో ప్రభాస్ ఊహలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. అప్పటివరకు ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తివేస్తూ అతడిని ఆకాశానికి ఎత్తేసిన బాలీవుడ్ మీడియా పూర్తిగా ప్రభాస్ పై నెగిటివ్ దాడి మొదలు పెట్టింది. వాస్తవానికి ‘రాథే శ్యామ్’ మూవీని డైరెక్ట్ హిందీ సినిమాగా బాలీవుడ్ ప్రేక్షకులు ఫీల్ అయ్యేవిధంగా ఆమూవీ పాటలు అన్నీ హిందీ సినిమా పాటల ట్యూన్స్ లో కంపోజ్ చేయించాడు.


ఈ సినిమాకు సంబంధించి ఎంపిక చేసిన కీలక పాత్రలో నటించిన వారిలో ఎక్కువమంది బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఈమూవీ తీసినా ‘రాథే శ్యామ్’ కు బాలీవుడ్ లో ఘోర పరాజయం జరిగింది. కనీసం వీకెండ్ సమయంలో కూడ ఈమూవీకి సరైన కలక్షన్స్ రాలేదు. ఇలా జరగడానికి ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ కారణం అయి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.


ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో డబ్ చేసి రిలీజ్ చేయబడ్డ ‘పుష్ప’ మూవీకి ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలక్షన్స్ వచ్చాయి. ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ ‘రాథే శ్యామ్’ విడుదల అయింది. ఈమూవీ తరువాత ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా బాలీవుడ్ ను తాకనుంది. దీనితో ఎలర్ట్ అయిన బాలీవుడ్ మీడియా దక్షిణాది సినిమా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి ‘రాథే శ్యామ్’ కు బాలీవుడ్ లో అంత ఘోరమైన రేటింగ్స్ ఇచ్చి ఉండవచ్చని ఇదే సినిమాకు పోటీగా విడుదలైన చిన్న సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  




మరింత సమాచారం తెలుసుకోండి: