‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ఇక కేవలం 5రోజులు మాత్రమే మిగిలి ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఈసినిమాకు సంబంధించి అదనపు షోలకు అనుమతితో పాటు టిక్కెట్ల రెట్లు పెంపుదల విషయమై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడంతో మన తెలుగు రాష్ట్రాలలో ‘ఆర్ ఆర్ ఆర్’ మొదటివారం పూర్తి అయ్యేసరికి ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ అప్పుడే విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.



అయితే ఇది అంతా నాణానికి ఒక వైపు కనిపించే విషయం. మధ్యతరగతి కుటుంబాలను కరోనా పరిస్థితులు కృంగతీయడంతో చాల కుటుంబాలు ఆర్థికంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. ఇప్పటికీ కొన్ని సంస్థల ఉద్యోగులకు పూర్తిగా జీతాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో పెరిగిన టిక్కెట్ల రేట్లలలో ఒక చిన్న కుటుంబం ‘ఆర్ ఆర్ ఆర్’ ను మల్టీ ప్లెక్స్ లో చూడాలి అంటే టిక్కెట్లకు దాదాపు 2వేల రూపాయలు అయ్యేపరిస్థితి కనిపిస్తోంది.




ఎంత గొప్ప బ్లాక్బష్టర్ మూవీ అయినప్పటికీ 50 రోజుల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తోంది. దీనితో ఇంత ఖర్చుపెట్టుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ ను ధియేటర్లలో చూసేకంటే ఈ మూవీ గురించి 3 సంవత్సరాలు పైన ఎదురు చూసినట్లుగా మరో 50 రోజులు ఎదురు చూస్తే ఏమిటి నష్టం అన్న ఆలోచన సగటు ప్రేక్షకుడులో ఏర్పడుతుందా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.



ఈమధ్య కాలంలో భారీ అంచనాలతో విడుదలైన ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ మూవీలను అభిమానులు బాగా చూశారు కానీ సగటు ప్రేక్షకుడు ధియేటర్ల వైపు చూడలేదు. యూత్ అదేవిధంగా చరణ్ జూనియర్ అభిమానులు ఈమూవీని చూసినంత మాత్రాన ఈమూవీ బయ్యర్లకు లాభం కలగదని గతంలో విడుదలైన ‘బాహుబలి’ ‘మహానటి’ సినిమాలకు సినిమాలు చూడటం మానేసిన ప్రేక్షకులు కూడ ధియేటర్లకు వచ్చి చూసినట్లుగా ‘ఆర్ ఆర్ ఆర్’ ను చూసినప్పుడు మాత్రమే ఈమూవీకి రాజమౌళి కోరుకుంటున్న 1000 కోట్ల కల నెరవేరే అవకాశం ఉంది అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: