తన ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచడం విశేషం. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ విధంగా రెండు సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న పవన్ ఇప్పుడు డైరెక్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే చారిత్రాత్మక సినిమా చేస్తున్న పవన్ ఈ సినిమా ను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అంతే కాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ సినిమా ను త్వరగా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇంకొకవైపు సురేందర్ రెడ్డి మరియు సుజిత్ దర్శకత్వంలో కూడా చెరో సినిమా ఓకే చేశాడు. ఈ నేపథ్యంలో ఆ చిత్రాలను కూడా ఈ ఏడాది మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఎన్నికల లోపు ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలు చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మరికొన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయట.
భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సాగర్ చంద్ర మరొక కథను పవన్ కు తొందరలో చెప్పబోతున్నాడు. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు బయటకు వినిపిస్తుంది. ఒకవేళ ఆ కథ సెట్ అయితే వెంటనే ఈ దర్శకుడికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరి అన్నీ కుదిరి పవన్ కి కథ నచ్చి సినిమా ఓకే చేస్తే మాత్రం మరొకసారి ఈ దర్శకుడు నక్క తోక తోక్కినట్లే. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఆయన ఓ సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు. ఈ సినిమా తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో పని చేయనున్నాడు. ఈ లోపు పవన్ కళ్యాణ్ కూడా తను ఓకే చేసిన సినిమాలను పూర్తి చేయనున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి