మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం
పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ
సినిమా మే 12వ తేదీన విడుదల కావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల సమయంలో ఓ అనుకోని కష్టం ఎదురవడం ప్రేక్షకులకు ముఖ్యంగా మహేష్ అభిమానులను ఇది ఎంతగానో నిరాశపరుస్తుంది. ఈ సినిమాకి మాత్రమే కాదు మహేష్ బాబు ఏ సినిమాకైనా కూడా ఈ సరికొత్త కష్టం ఎదురవడం వారిని మరింత నిరాశపరుస్తుంది.
అదేమిటో కాదు మహేష్
సినిమా విడుదలైనప్పుడే ఓ
హాలీవుడ్ విడుదల కావడం జరుగుతుంది. అలా సర్కారు వారి పాట చిత్రం విడుదల సమయంలో
హాలీవుడ్ లో భారీ సినిమాలను తెరకెక్కించే నిర్మాణ సంస్థ మార్వెల్ నుంచి
డాక్టర్ స్ట్రేంజ్
సినిమా విడుదల కాబోతుంది. గతంలో మహేష్ సినిమాలు విడుదల సమయంలో ఈ సంస్థ నుంచి వచ్చిన సూపర్ హీరోల సినిమాలు వచ్చి మహేష్ కలెక్షన్ల పై భారీగా ప్రభావాన్ని చూపాయి. ఆ విధంగా ఇప్పుడు ఈ
సినిమా కలెక్షన్ల పై కూడా మార్వెల్
సినిమా ఏమైనా ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ
సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని ఎలాంటి సందేహం లేదు.
మాస్ మసాలా అంశాలను బాగా చిత్రీకరించి ఈ సినిమాను మహేష్ అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నాడు. దర్శకుడు
పరశురామ్ దర్శకత్వం గురించి వంక పెట్టనవసరం లేదు. ఇప్పటికే ఈ
సినిమా నుంచి పాటలు విడుదల కాగా అవి భారీ విజయాలను సాధించాయి. మరి ఈ
సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి రికార్డులను నెలకొల్పుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మార్వెల్
సినిమా ప్రభావం ఏస్థాయిలో ఉంటుందో. మహేష్ కలెక్షన్ల పై ప్రభావం చూపిస్తుందో చూడాలి.