ఇక కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలో శ్రుతి హాసన్ కు అనుకోని షాక్ అనేది తగిలింది. లండన్ కుర్రాడు మైఖేల్ కర్సెల్ తో కొన్ని సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలిన శ్రుతి హాసన్.. అతడినే పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ శ్రుతి హాసన్ -మైఖేల్ లు లాస్ ఏంజెల్స్ చెన్నై ముంబై వంటి చోట్ల చట్టాపట్టాలేసుకుని తిరిగడం కూడా జరిగింది. ఇక తమకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కానీ పలు విభేదాలనేవి తలెత్తడంతో చివరకు వీరిద్దరూ కూడా బ్రేకప్ చెప్పుకున్నాడు.ఇక ఈ బ్రేకప్ వల్ల డిప్రెషన్ కు గురైన శ్రుతి హాసన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా కానీ మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టి ఫుల్ జ్యోష్ లో దూసుకుపోతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు మరింత చేరువవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దుస్తుల విషయంలో తన ఆలోచనల్ని అందరితోనూ షేర్ చేసుకుంది. ఇక సాధారణంగా సెలబ్రెటీలు ఒక్కసారి వాడిన దుస్తులను మళ్లీ వాడరనే సంగతి తెలిసిందే.



ఇక ఈ లిస్ట్ లో శ్రుతి హాసన్ కూడా ఒకరని చెప్పాలి.కానీ వాడేసిన బట్టలను శృతి హాసన్ పక్కన పడేయకుండా ఇక వాటితో డబ్బును సంపాదిస్తోంది. ఇక తను వాడేసిన దుస్తుల్ని మళ్లీ అమ్మకానికి పెడుతుందట. అలా రీసేల్ చేయగా వచ్చిన డబ్బుల్ని ఆమె పలు సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తుందట. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. అలాగే గత క్రిస్మస్ పండగ సమయంలో కూడా తనకు ఎంతో ఇష్టమైన దుస్తులు రీ సేల్ చేసి చారిటీ కోసం ఫండ్స్ ని రైజ్ చేసిందట. మొత్తానికి శ్రుతి హాసన్ తన అదిరిపోయే ఐడియాతో వాడేసిన దుస్తులను వృథా చేయకుండా బాగా తెలివిగా డబ్బు సంపాదిస్తోంది.ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి గనుక వస్తే.. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ప్రభాస్ సరసన `సలార్` సినిమా చేస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `మెగా 154` బాలయ్యతో `ఎన్బీకే 107` సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇంకా అలాగే వీటితో పాటే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా శృతి హాసన్ చేతిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: