ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి నేను శైలజ అనే చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాని డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత మహానటి సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకున్నది. సావిత్రి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ చాలా అద్భుతంగా నటించింది. దీంతో సాధారణ ప్రేక్షకులు సైతం, ఈమె పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు. కేవలం తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే పెంచుకుంటూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.
అయితే గ్లామర్ పాత్రలు చేయకపోవడానికి కారణం ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది కీర్తి సురేష్.. ఎవరైనా నటిగా ప్రేక్షకులు ఇష్టపడాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న పాత్రలే తనను వెతుక్కుంటూ వచ్చాయి అని వాటితో ఆదరణ పొందాలని కేవలం గ్లామర్ పాత్రలకే మొదటి ప్రాధాన్యత కానే కాదని తెలియజేసింది. అయినా తెరపై ఎలా కనిపించాలి అనే విషయంపై తనకు కొన్ని హద్దులు ఉన్నాయని వాటిని ఎవ్వరూ చేరలేదని.. అందుచేతనే గ్లామర్ పాత్రలు చేయలేదు అని తెలియజేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తున్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి