పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగానే కలిగించింది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా కు ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయ్యింది అని చెప్పవచ్చు. మహేష్ లుక్ ఈ సినిమాలో హైలెట్ గా కనిపిస్తూ ఉండగా ఈ చిత్రం ద్వారా మహేష్ మరొక భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం ఖాయం అని ఆయన అభిమానులు చెబుతున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్ర పోషిస్తున్నడం విశేషం. ట్రైలర్ను బట్టి ఈ సినిమా మ్యసివ్ గా తెరకెక్కింది అని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ కూడా ఎంత పవర్ ఫుల్ గా ఉన్నాయని చెప్పవచ్చు. మే 12 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఆ విధంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది యూనిట్. ఈ సినిమా యొక్క టెక్నీషియన్స్ ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటుండగా నటీనటులు కూడా ఈ ప్రమోషన్స్ లో చేరబోతుండటం విశేషం.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న పరుశురామ్ సినిమా పై కొన్ని ఆసక్తి కర విషయాలను వెల్లడించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమాలోని ఇంట్రెస్టింగ్ విషయాల తో పాటు కొన్ని పర్సనల్ విషయాల గురించి కూడా ఆయన వెల్లడించారు. మహేష్ బాబు తో ఆయనకు విభేదాలు వచ్చిన విషయాన్ని చెప్పారు. ఆ మధ్య ఈ రకమైన వార్తలు ఆ మధ్యలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తూ మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి వెల్లడించారు. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదని ఆయన మనసు బంగారం అని ఆయన వెల్లడించడం ఇప్పుడు వైరల్ గా మారింది. మహేష్ అభిమానులున్నారు దీనిని తెగ ప్రచారం చేస్తూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: