ఎంత పెద్ద స్టార్ హీరో అయిన ప్లాపులు ఎదురుకోక తప్పదు.మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరియర్ లో ఇండస్ట్రీని షేక్ చేసిన హిట్లతో పాటు భారీ పరాజయాలను కూడా ఎదుర్కొన్నాడు. ఇక ఆయన ఎదుర్కొన్న డిజాస్టర్ సినిమాల లిస్ట్ ఒకసారి చూసేద్దామా.



1.అంజి : కోడి రామ కృష్ణ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న చిరు భారీ బడ్జెట్ మూవీ అంజి సినిమా అంచనాలను తారుమారు చేసి పెద్ద పరాజయాన్ని చవిచూసింది.


2.శంకర్ దాదా జిందాబాద్ : శంకర్ దాదా MBBS లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్  ప్రేక్షకుల ఆదరణ అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది.


3.మృగరాజు: హాలీవుడ్ చిత్రం 'ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన చిరంజీవి మృగరాజు సినిమా బాగున్నా కానీ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది.


4.బిగ్ బాస్: ఇక విజయ బాపినీడు డైరెక్షన్ లో వచ్చిన మెగాస్టార్ మూవీ 'బిగ్‌బాస్' కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌ సినిమాగా మిగిలింది.


5.రిక్షావోడు : మెగాస్టార్ చిరంజీవి ఇంకా నగ్మా హీరోహీరోయిన్లుగా నటించిన రిక్షావోడు సినిమా కూడా అంచనాలకు భిన్నంగా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.


ఇదే తరహాలో చిరంజీవి, శ్రీదేవి నటించిన ఎస్పీ పరుశురాం, ఇంకా చిరు , విజయశాంతి కాంబోలో వచ్చిన స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్, అలాగే చిరు ప్రధాన పాత్రలో నటించిన లంకేశ్వరుడు, రాజ విక్రమార్క, యుద్ద భూమి ఇంకా మోహన్ బాబు చిరు కలిసి నటించిన చక్రవర్తి, అదే విధంగా చిరు చిత్రం ఆరాధన, త్రినేత్రుడు ఇంకా చిరు, సుహాసినిల కాంబోలో వచ్చిన కిరాతకుడు, జేబు దొంగ, రుద్ర నేత్ర , చాణక్య శపథం, వేట, చిరంజీవి, ధైర్యవంతుడు, శివుడు శివుడు శివుడు ఇంకా అలాగే హీరో వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా వసూళ్లు సాధించలేక విఫలం అయ్యి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో పెద్ద డిజాస్టర్ గా మిగిలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: