ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సర్కారు వారి పాట  మూవీ మేనియా స్పష్టంగా కనబడుతుంది.  సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.  

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని సాంగ్స్ ని ,  టీజర్ ని ,  ట్రైలర్ ని విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.  ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ని ప్రారంభించారు.  ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

అందులో భాగంగా హైదరాబాద్ సిటీ లో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లు అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది.  ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సర్కారు వారి పాట సినిమా హైదరాబాద్ లో 6 కోట్లకు పైగా కలెక్షన్ లు  వసూలు చేసినట్లు తెలుస్తోంది.  ఇది ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత బెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ గా తెలుస్తుంది.  మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: