ఒక సంవత్సరంలో ఎన్ని సీజన్లు అలాగే ఎన్ని సెలవులు ఉన్నా కూడా సంక్రాంతి పండుగ అప్పుడు ఉండే బాక్సాఫీస్ స్టామినా ఇంకే నెలలోనూ ఉండదు అన్నది మాత్రం వాస్తవం. అవును నిజం ముందుగా అనుకున్న విధంగా ఒకవేళ 'సర్కారు వారి పాట' సినిమా కనక జనవరిలో సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయ్యుంటే మాత్రం ఇప్పుడున్న హైప్ ఇంకా రెట్టింపు అవ్వటమే కాకుండా కలెక్షన్లలో కూడా చాలా మార్పు కనిపించేది. అవును ఆ పండగ పవర్ అలాంటిది. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆ పండగ కోసం నిర్మాతలు అలాగే హీరోలు ముందస్తుగానే పోటీ పడటం చూస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు అదే తరహాలో 2023లోనూ సేమ్ సీనే రిపీట్ అవ్వడం ఖాయమని అలాగే పోటీ కూడా ఆ రేంజ్ లోనే ఉండబోతోంది అని చెప్పవచ్చు.

కాగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన 'ఆదిపురుష్' ని 2023లో సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. కాకపోతే  అఫీషియల్ గా డేట్ ప్రకటించడం ఒక్కటే పెండింగ్ ఉంది. అంతేకాదు శ్రీరాముడి బ్యాక్ డ్రాప్ లో రూపొందటంతో  పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఓపెనింగ్స్ ఉండనున్నాయి. కాగా ఇప్పుడు అదే తరహాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు'ని కూడా సంక్రాంతికి దింపబోతున్నారు. ఇది క్రిష్ డైరెక్షన్ లో ఏఎం రత్నం గ్రాండియర్ గా నిర్మిస్తుండగా, పవర్ స్టార్ కెరీర్ లోనే ఒక మెయిలు రాయిగా ఇది నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. కానీ ముందుగా 2022 దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అది సాధ్యపడేలా లేదు. అందుకే సంక్రాంతి సమయంలోనే రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు.

ఇక తమిళ స్టార్ హీరో విజయ్ అలాగే రష్మిక మందన్న కాంబోలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న తలపతి 66 కూడా పొంగల్ రేస్ లో ఉంటుందని దిల్ రాజు చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కాగా అరవ ఫెస్టివల్ సెంటిమెంట్ కాబట్టి విజయ్ కూడా ఈ పోటీకే సిద్ధపడతాడు. అయితే ఇవే కాకుండా విజయ్ దేవరకొండ సమంతలతో శివ నిర్వాణ చేస్తున్న సినిమా కూడా అప్పుడే విడుదల కానుందట. అయితే ప్రస్తుతానికి పండగను టార్గెట్ చేసుకున్న సినిమాల లిస్టులో ఇవి మాత్రమే ఉన్నాయి. అయితే ఏడు నెలల ముందు నుండే సంక్రాంతికి ఇంత కాంపిటీషన్ ఉందంటే ఆ సమయానికి ఇంకెలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: