తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి ఇంకా 7నెలల సమయం ఉంది. అయితే అప్పుడే ఇండస్ట్రీలో వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల పోటీ పై చర్చలు మొదలుకావడమే కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి విజేత ఎవరు అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

 

 సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ ను నమ్ముకుని పాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్’ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని హిందూమత సంఘాలు ‘ఆదిపురుష్’ మూవీని పరోక్షంగా ప్రమోట్ చేస్తూ హిందువులు అంతా ఈమూవీని చూడాలని పిలుపు ఇస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయించే అవకాశం కూడ ఉంది అంటూ లీకులు వస్తున్నాయి.

 

 ఇలాంటి భారీ అంచనాలు ఉన్న మూవీతో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పోటీ పడుతోంది. పవన్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ మూవీగా నిర్మింప బడుతున్న ఈమూవీ కోసం క్రిష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడ చాల కష్టపడుతున్నాడు. 50 సంవత్సరాలు దాటిన పవన్ ఈమూవీలో డూప్ సహాయంలేకుండా రిస్కీ ఫైట్స్ చేస్తున్నాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కు సవాల్ విసిరే ఒక బందిపోటు పాత్రలో పవన్ నటిస్తున్నాడు.

 

 ఈసినిమాను కూడ సంక్రాంతి రేస్ లోకి దింపుతున్నారు. దీనితో సంక్రాంతి రేస్ పై కన్నేసిన రామ్ చరణ్ శంకర్ ల మూవీ సంక్రాంతికి కాకుండా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది అన్నసంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభాస్ తో సమానంగా పవన్ కు వీరాభిమానులు ఉన్నారు. గతంలో ఒకసారి కేవలం ఒక బ్యానర్ కోసం ప్రభాస్ పవన్ అభిమానులు వీరంగం సృష్టిస్తే స్వయంగా ప్రభాస్ పవన్ లు రంగంలోకి దిగి ఆ వ్యవహారాన్ని సద్దుబాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చే సంక్రాంతికి ప్రభాస్ పవన్ ల సినిమాల పోటీ వల్ల మళ్ళీ రిపీట్ అవుతుందా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలవుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: