చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చి వరుస చిత్రాలతో చక్రం తిప్పిన హీరోయిన్లలలో ఒకరు నటి ఛార్మి. స్కూలింగ్ వయసు లోనే ఈ అందాల తార ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టిందన్న విషయం అందరికి తెలిసుండకపోవచ్చు. అయితే ఢిల్లీలో స్కూల్ చదువుతున్న సమయంలో ఒక దర్శకుడు ఛార్మిని చూసి సినిమా అవకాశం ఇస్తానని అన్నారు. అప్పుడు ఛార్మి వయసు 14 ఏళ్లు. అలా అంతా చిన్న వయసు లోనే సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టింది. మొదట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినా శ్రీ ఆంజనేయం, లక్ష్మి, మాస్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తొలుత తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ పంజాబీ భామ ఆ తరవాత తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లోను అవకాశాలు అందుకుని పాపులారిటీని సంపాదించుకుంది.

ఈమె సుమారు  60 కి పైగా చిత్రాల్లో కీ రోల్స్ చేసింది ఛార్మి. అయితే తన కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అంటే మాత్రం మంత్ర సినిమా గుర్తుకు రావాల్సిందే. అంతగా ఆ చిత్రంలో ఒదిగిపోయింది ఈ బొద్దుగుమ్మ. ఈ చిత్రానికి గాను నంది అవార్డులు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తరవాత ఈమె కెరియర్ ఎక్కడికో వెళుతుందని నెంబర్వన్ హీరోయిన్ గా స్వింగ్ లోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ నిజానికి ఈ చిత్రం తరవాత బాగా స్లో అయ్యిందనే చెప్పాలి. స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు బాగా తగ్గాయి,  చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద చతికిల బడటంతో కెరియర్ బాగా డల్ అయిపోయింది.

చివరికి మంగళ చిత్రంతో హీరోయిన్ గా మంగళం పాడి ఇపుడు నిర్మాతగా మారి ఈ యాంగిల్ లో ఇండస్ట్రీలో తన లక్ ను టెస్ట్ చేసుకుంటోంది.  దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా చిత్రాలు తెరకెక్కిస్తే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛార్మీ నిర్మాతగా  లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: