సినిమా హీరోయిన్లు కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలా ఇతర వ్యాపారాలు చేసిన వారిలో కొంత మంది హీరోయిన్లు సక్సెస్ అయితే, మరి కొంత మంది ఫెయిల్యూర్ కూడా ఆయన వారు ఉన్నారు. ఇది ఇలా ఉంటే అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ ముద్దుగుమ్మకు జిమ్ అన్న , జిమ్ లో వర్కవుట్లు అన్నా ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫోటోలను , వీడియో లను  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన పడే కష్టాన్ని, తన అందం కోసం తాను తీసుకునే శ్రద్ధను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా జిమ్ అంటే ఉన్న ఇష్టం తో  రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్‌ 45 పేరుతో హైదరబాద్‌తో పాటు వైజాగ్‌ లో జిమ్ లను ప్రారంభించిన విషయం మాన్స్ అందరికీ తెలిసిందే.  ఇలా జిమ్ సెంటర్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం నటిగా,  బిజినెస్ ఉమెన్ గా రెండింటి లోనూ సక్సెస్ ఫుల్ ఉమెన్ గా కెరియర్ ను సాగిస్తోంది.  ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు పోటీగా మరో హీరోయిన్ జిమ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యింది.  

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి సనన్ తాజాగా జిమ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యింది.  ది ట్రైబ్‌ అనే జిమ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా కృతి సనన్ తెలియజేసింది.  8 సంవత్సరాల క్రితం నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో నా జెర్నీ ని ప్రారంభించాను. సరిగ్గా అదే రోజున ముగ్గురు సూపర్‌ టాలెంటెడ్‌ కో-ఫౌండర్ లు అయిన అనుష్క నందానీ, కరణ్‌ సాహ్నీ, రాబిన్‌ బెహ్ల్‌లతో కలిసి ఒక వ్యాపారవేత్తగా ది ట్రైబ్‌ను లాంచ్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని కృతి సనన్‌ సోషల్ మీడియా ద్వారా తాజాగా తెలియజేసింది. ఇలా కృతి సనన్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: