టాలీవుడ్ ఇండస్ట్రీ లో  సక్సెస్ ఫుల్ దర్శకులలో ఒకరు అయిన అనిల్ రావిపూడి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటి వరకు పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 మూవీ లకు దర్శకత్వం వహించాడు.

 ఈ మూవీ లు అన్ని కూడా దాదాపు కామెడీ ఎంటర్ టైనర్లే.  ఇలా కామెడీ ఎంటర్టైనర్ సినిమా లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న అనిల్ రావిపూడి తాజాగా ఎఫ్ 3 మూవీ కి దర్శకత్వం వహించాడు.  ఈ సినిమా నిన్న అనగా మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.  ఈ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి అని అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ... పౌరాణికాల్లో  మాయా బజార్ లాంటి మూవీ ని చేయాలనుంది. అలాగే జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి సోషియో ఫాంటసీ మూవీ చేయాలని ఉంది. అలాంటి  ఛాన్స్ వస్తుంది అని అనుకుంటున్నాను,  రావాలి అని కోరుకుంటున్నాను అని తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా నందమూరి నటసింహం బాలకృష్ణ తో తెరకెక్కించబోతున్నాడు. బాలకృష్ణ తో తాను తెరకెక్కించబోయే సినిమా తన స్టైల్ లో కామెడీ యాంగిల్ లో ఉండదు అని , బాలకృష్ణ స్టైల్ లో ఫుల్ మాస్ , యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని ఓ సందర్భంలో అనిల్ రావిపూడి తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: