టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ లో రామ్ పోతినేని తన పవర్ ఫుల్ పోలీస్ గా అదరగొట్టాడు. అలాగే మొట్ట మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

 లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్షన్ నెం. 6 గా శ్రీనివాసా చిట్టూరిమూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ది వారియర్ మూవీ ని తెలుగు,  తమిళ భాషల్లో జులై 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా,  ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన పాటల్లో నుంచి చిత్ర బృందం బుల్లెట్ అనే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ ను తమిళ హీరో శింబు పాడాడు. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను తెచ్చుకొని దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. ఇకపై ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను చక చకా నిర్వహించి అనుకున్న తేదీ కి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: