దళపతి విజయ్, శివకార్తికేయన్, ధనుష్ వంటి హీరోలు తెలుగు దర్శకులతో నిర్మాతలతో తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది హీరోలు సై తం ఈ విధంగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ జాబితాలోకి మరో తమిళ చేరడం విశేషం. పలు సినిమాలతో తెలుగు లో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో కార్తీ ఇప్పుడు నేరుగా ఓ తెలుగు సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా కార్తీ తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు.
ఈనేపథ్యంలో ఆయనకు తెలుగు లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఆయనతో సినిమా చేయాలనీ భావిస్తున్నాడట. ఆల్రె డీ పేరున్న నిర్మాత కావడం తో కార్తీ కూడా సినిమా చేసే విషయంలో ఆలోచనలేమీ చేయడం లేదట. ఆ విధంగా అల్లు అరవింద్ తో కార్తీ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడని సంబరాలు చేసుకున్నారు కార్తీ అభిమానులు. ఈ సినిమా కి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సర్దార్ సినిమా విడుదలకు సిద్ధం చేశాడు కార్తీ. ఈ చిత్రంలో ఎంతో వెరైటీ పాత్ర లో కనిపించబోతున్నాడు.ముసలి పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవబోతుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి