యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా మూవీ విక్రమ్. విశ్వరూపం 2 సినిమా తర్వాత కమల్ హాసన్ తెర మీద కనిపించి చాలా రోజులు అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన నటిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు. ఖైదీ మాస్టర్ వంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం.

అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మలయాళ హీరో ఫాహాద్ ఫజిల్ కీలక పాత్రలు పోషించారు. హీరో సూర్య కూడా గెస్ట్ రోల్లో కనిపించనున్నాడని తెలియడం తో ఈ సినిమాను చూడటానికి తమిళనాడు మొత్తం ఆతృత గా సిద్ధం అవుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కూడా తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల ఆసక్తి లేకపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమాలో నటించే అందరూ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న వారే అయినా కూడా కొంతైనా బజ్ లేకపోవడం చిత్ర బృందాన్ని ఎంతో నిరాశ పరుస్తుంది. 

ఈ సినిమాను వెరైటీగా ప్రమోట్ చేస్తోంది చిత్రబృందం. దేశవ్యాప్తంగా పలు నగరాలలో తిరుగుతూ అన్ని భాషల మీడియాలతో ఇంటరాక్ట్ అవుతూ సినిమా విశేషాలను చెబుతున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ప్రమోషన్స్ చేయకపోవడం ఈ సినిమాకు బజ్ లేకపోవడానికి కారణం అని చెబుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల  వరకు ఓకే కానీ ప్రమోషన్స్ చేయకపోవడంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కూడా సినిమా పై ఎలాంటి సందడి కనిపించడం లేదు. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకులను అలరిస్తున్న కమల్ హాసన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఈ చిత్రం ద్వారా ఆయన తెలుగు రాష్ట్రాలలో ఏవిధమైన విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: