బాలీవుడ్ కాంట్రవర్సి బ్యూటీ కంగనా రనౌత్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంగనా రనౌత్ సినిమాలు మాత్రమే కాకుండా సమాజంలో జరిగే అనేక విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇలా బాలీవుడ్ లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండే కంగనా రనౌత్ తాజాగా ధాకడ్‌ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి కూడా కంగనా రనౌత్ చాలా ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంది. యాక్షన్ డ్రామా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా మే 20 వ తేదీ గ్రాండ్ గా విడుదల అయ్యింది. విడుదలైన మొదటి రోజు నుండే ఈ మూవీ కి బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ లభించింది. అలా నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల పై దాని ప్రభావం తీవ్రంగా చూపించింది. దానితో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా చాలా తక్కువగా బాక్సాఫీస్ దగ్గర నమోదు అయ్యాయి.

ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ నటించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ కి నిర్మాతలు భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 90 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంగనా రనౌత్ తాజా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటివరకు కేవలం 5 కోట్ల షేర్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది.  ఇకపై కూడా ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో కంగనా రనౌత్ నటించిన తాజా సినిమాకు 85 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా కంగనా రనౌత్ నటించిన తాజా సినిమాకు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో కంగనా రనౌత్ ఈ సినిమాతో భారీ అపజయాన్ని బాక్సాఫీస్ దగ్గర మూటగట్టుకోబోతునట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: