రానా హీరోగా నటిస్తున్న తాజా సినిమా విరాటపర్వం. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా మరిన్ని సినిమాలు విడుదల ఉన్న కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి వేణు ఊదుగుల దర్శకత్వం వహించగా జూన్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం యొక్క విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచింది. టీజర్ తో పాటు కొన్ని పాటలు కూడా ప్రేక్షకులను అలరించగా వారి దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా బృందం మరొక పాట ను కూడా విడుదల చేసింది. అది కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందులోని సాహిత్యం ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. 1990 కాలంలో జరిగిన ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నారు.

రామానాయుడు సమర్పణలో సురేష్ బాబు ఈచిత్రాన్ని నిర్మించగా సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న రానాకు ఈ సినిమా హిట్ తప్పనిసరి అయ్యింది. మరి తొలిసారి ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఆయన ఈ చిత్రం ద్వారా ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని చూడాలి. సాయి పల్లవి కూడా వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నగా ఈ చిత్రం ద్వారా ఆమె మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు ఆమె అభిమానులు.  మరి అందరికి విజయం అవసరమైన నేపథ్యంలో ఈ సినిమా అందరికి మంచి సక్సెస్ ను తెచ్చిపెడుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: