తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నాని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నాని ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో  క్రేజీ హీరోగా కొనసాగుతున్న నాని ఆకారుగా నటించిన 5 సినిమాలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

అంటే సుందరానికి : నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా  హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా తాజాగా 10 జూన్ 2022 వ తేదీన థియేటర్ లలో విడుదలయ్యింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.87 కోట్ల కలెక్షన్లను సాధించింది.


శ్యామ్ సింగరాయ్ : నాని హీరోగా సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా మడోనా సబాస్టియన్ కీలకపాత్రలో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.


గ్యాంగ్ లీడర్ : నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్  మూవీ  రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.57 కోట్ల  కలెక్షన్లను సాధించింది.


జెర్సీ : నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.47 కోట్ల కలెక్షన్లను సాధించింది.


దేవదాస్ : నాని మరియు నాగార్జున హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమా విడుదలైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: