ఇపుడిపుడే కరోనా దెబ్బ నుండి కోలుకుంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మరో షాక్ తగిలింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం బంద్ అంటూ కూర్చున్నారు సినీ కార్మికులు. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ లు ఉండటంతో ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోవడం, థియేటర్లు కు తాళం, స్టార్ లంతా కూడా కరోనా కలకలం పూర్తిగా తగ్గే వరకు అసలు షూటింగ్ వైపు చూసేదే లేదు అని గట్టిగా చెప్పేయడం ఇలా పలు కారణాల వలన తీవ్రంగా నష్టపోయింది. ఆర్దికంగా కుదేలుపడింది. అయితే ఈ మధ్యే కాస్త కరోనా శాంతించడంతో ఇపుడిపుడే అన్ని మామూలు స్థితికి చేరుకుంటున్నాయి. సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యి చాలా వరకు హిట్ అవడం తో ఇపుడిపుడే మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకుంటున్న సమయం లో ఇపుడు మళ్ళీ మరో షాక్ తగిలింది.

ఆ వార్త విని ఇండస్ట్రీ వర్గాలు నివ్వెరపోతున్నాయి. సినీ పరిశ్రమ పెద్దలు ఆ వార్త విని తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఏమయ్యింది అంటే.. సినీ కార్మికులంతా ఒక్కటిగా చేరి బంద్ ప్రకటించడం తో ఇండస్ట్రీ షాక్ అయ్యింది.  గత కొంత కాలం నుండి తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న సినీ కార్మికులు.. ఇపుడు బంద్ అనడంతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కాగా వేతనాలు పెంపు విషయంలో ఇప్పటి వరకు కార్మికుల ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తో ఇపుడు బంద్ అని భీష్మించుకు కూర్చున్నారు సినీ పరిశ్రమ కార్మికులు .  తమ వేతనాలు పెంచే వరకూ షూటింగుల్లో పాల్గొనమని ఫెడరేషన్‌కి లేఖ ను రాసి ఇప్పటికే చేరవేశారు.

అంతేకాదు రేపు  ఫెడరేషన్ ని చుట్టుముట్టి తమ బంద్ ను ఉద్రిక్తత పెంచాలని ఫిక్స్ అయ్యారట కార్మికులు. అయితే వీరు తీసుకున్న నిర్నయామ్ ముమ్మాటికీ కరెక్ట్ అని అంతా మద్దతు ఇస్తున్నారు. ఎవరి పని వారికి చాలా గొప్ప.. ప్రతి పనిలోనూ అభివృద్ధిని కోరుకోవడంలో తప్పులేదు. అదే విధంగా కార్మికుల వేతనాలు కూడా పెంచే బాధ్యత సినీ పరిశ్రమ పెద్దలు తీసుకోవాలి. మరి ఈ విషయం పట్ల త్వరగా స్పందించి పరిష్కరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: