వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ జయాపజయాలను లెక్క చేయకుండా.. ఇండస్ట్రీ సమస్యలను ఢీ కొడుతూ తన ప్రయాణాన్ని కొనసాగించడం అంటే ఎంతో ఒత్తిడి తగ్గించుకోవడం అని చెప్పవచ్చు.. అగ్ర నిర్మాతగా, సినిమాల పంపిణీదారులలో పేరు పొందారు దిల్ రాజ్. ఇటీవల ఇలాంటి ఒత్తిడిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాకుండా గత కొంతకాలం పాటు తన భవిష్యత్ ప్రాజెక్టులు కూడా నిలిపివేస్తూ చాలా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. పరిశ్రమలో ప్రస్తుతం బంద్ కారణంగా కొద్దిరోజుల పాటు థియేటర్లకు జనాలు హాజరు కూడా తక్కువగా ఉండడంతో దిల్ రాజు తన తదుపరి సినిమా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అంతే కాకుండా పరిశ్రమలో సమస్యలు సద్దుమణిగే వరకు సైలెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ - రామ్ చరణ్, హీరో విజయ్ - వంశీ పైడిపల్లి తో రెండు భారీ బడ్జెట్ సినిమాలకి నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రాన్ని బహు భాషలలో విడుదల చేసి సక్సెస్ కావాలని ఆరాటపడుతున్నారు దిల్ రాజు. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భారీగా నిధులు సమకూర్చారు . అందుకే ఇవి కాకుండా ఇతర ప్రాజెక్టులపై పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడలేదు.. ప్రస్తుతం నాగచైతన్యతో థాంక్యూ సినిమాని పూర్తి చేసుకున్నారు.

అలాగే దిల్ రాజు ఇటీవల సినిమాల పంపిణీ కారణంగా కొన్ని నష్టాలను కూడా చవిచూశాడు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ఒత్తిడిని జయించేందుకు దిల్ రాజు తన కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లారు. దిల్ రాజు ప్రస్తుతం సింగపూర్లో విహార యాత్రలలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తాను కొంత సమయాన్ని  కేటాయించి ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లారు. తన కూతురితో సహా మనవరాళ్లతో కలిసి ఈ యాత్రను కొనసాగించారు. సింగపూర్ లో ఫాదర్స్ డే జరుపుకుంటున్న ఫోటోలను కూడా తన కుమార్తె హన్షిత రెడ్డి షేర్ చేసింది. ఇక దిల్ రాజు కూడా తన కుటుంబం సంతోషం కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: